free entry into salarjung: వేసవి సెలవుల్లో పిల్లలతో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ నగరవాసులకు సాలార్‌జంగ్ మ్యూజియం గొప్ప అవకాశం కల్పిస్తోంది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా మే 16 నుంచి 21 వరకు ఉచిత ప్రవేశం కల్పించారు. సందర్శకులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియాన్ని సందర్శించవచ్చు. అంతేకాకుండా, భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 75 వస్తువుల ప్రదర్శన, బిద్రి తయారీపై వర్క్‌షాప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.