సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ స్థలం మారింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ఈ పనుల కారణంగా పార్కింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి అనుగుణంగానే అధికారులు పార్కింగ్ ప్లేస్ లో మార్పులు చేశారు. ప్లాట్ ఫాం నంబర్ 10 వైపు పార్కింగ్ స్థలాన్ని మార్చి.. రేట్లను కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.