తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి 'పూలే' సినిమా వీక్షించారు. సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవితాలను, వారి త్యాగాలను తెలిపే ఈ చిత్రాన్ని వీక్షించడం ద్వారా నేటి తరానికి స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేశారు.