సినిమా టికెట్లపై అక్రమ లాభాలు.. 'AMB సినిమాస్‌'కు రూ.1.1 కోట్ల ఫైన్

3 weeks ago 6
జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు బదిలీ చేయకుండా అక్రమంగా బేస్ ధరలు పెంచి లాభపడిన వ్యవహారంలో ప్రముఖ నటుడు మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ సహా తెలంగాణలోని ఆరు థియేటర్లపై జీఎస్‌టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) కొరడా ఝళిపించింది. ఈ థియేటర్లు మొత్తం రూ. 1.7 కోట్లను సెంట్రల్, తెలంగాణ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్స్‌లో జమ చేయాలని ఆదేశించింది. ఇందులో అత్యధికంగా ఏఎంబీ సినిమాస్ రూ. 1.1 కోట్లు చెల్లించాల్సి ఉంది. టికెట్ ధరలపై పన్ను తగ్గినప్పటికీ పాత ధరలనే కొనసాగించి యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రిబ్యునల్ నిర్ధారించింది.
Read Entire Article