గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై 2023లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును ఏ3 నిందితుడిగా చేర్చారు.