KTR on Rythu Runa Mafi: తెలంగాణలో రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు పూర్తి చేశామని.. సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. అయితే.. మిగతా మంత్రులు మాత్రం చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావే.. ఇంకా 20 లక్షల మంది రైతులను రుణమాఫీ చేయాలని స్పష్టం చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీటు చేశారు.