Chandrababu Naravaripalli Cluster Development: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరైన నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకుంటూనే గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.30-40 వేల ఆదాయం వచ్చేలా 'వర్క్‌ఫ్రమ్ హోమ్' సెంటర్లు, పర్యాటక రంగ అభివృద్ధి, సాగునీటి సరఫరా మెరుగుదల వంటి కీలక ప్రణాళికలను అధికారులకు వివరించారు. ఈ అభివృద్ధి పనులతో గ్రామానికి కొత్త కళ తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.