ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రాజన్న ఆలయ అభివృద్ధి, కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, నేతన్న బజార్ వంటి కార్యక్రమాలు ఈ పర్యటనలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయ పరంగానూ ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ ఇలాఖాలో రేవంత్ రెడ్డి సభ పెట్టడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక సీఎం పర్యటనకు ముందు కేటీఆర్ బహిరంగ లేఖ రాయడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.