రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు చేపట్టిన నో హెల్మెట్ - నో పెట్రోల్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. డిసెంబర్ 15 నుంచి తిరుపతి జిల్లాలో ఈ నిర్ణయం అమల్లోకి రాగా.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తిరుపతి పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ సైతం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వారిని అభినందించారు. మంచి ఆలోచన చేశారంటూ ప్రశంసించారు.