కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే.. మళ్లీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా ఛేంజ్ చేయకుండా టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అసలు ఈ సినిమా ఆడియెన్స్ మీద చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.