ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలోని ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటంపై తనదైన శైలిలో పోరాడుతున్న కేఏ పాల్.. ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. గతంలో కేఏ పాల్ లేవనెత్తిన విషయాలపై ఏకీభవించిన హైకోర్టు.. ఇప్పుడు మాత్రం కుదరదని తేల్చేసింది. దీంతో.. ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో సీన్ రివర్స్ అయినట్టయింది. కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది