గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉద్యోగ కల్పనపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అందులో భాగంగా మంగళవారం సుజ్లాన్ ఎనర్జీ, స్వనీతి సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. సుజ్లాన్ గ్రూప్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం.. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఏపీలో ప్రారంభించనున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా యువతకు ట్రైనింగ్ అందించి.. ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.