హైదరాబాద్‌లో అలజడి సృష్టించిన హైడ్రా.. ప్రస్తుతం కాస్త విరామం తీసుకుంది. అయితే.. ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కూల్చివేతలకు 15 రోజుల ముందు ఆ నిర్మాణ యజమానికి నోటీసులు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.. తమకు వర్తించదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.