నేషనల్ హైవే NH 365B అలైన్‌మెంట్ మార్పు చేయాలనే రైతుల డిమాండ్‌కు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సానుకూలంగా స్పందించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రైతుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులను కలిశారు. రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసే కొత్త అలైన్‌మెంట్‌ను పరిశీలించాలని ప్రతిపాదించగా, అధికారులు పాత భూసర్వే నిలిపివేసి కొత్త మార్గంపై పరిశీలనకు అంగీకరించారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులకు ఊరట లభించింది.