సైబర్ కేటుగాడిపై పీడీ యాక్ట్.. తెలంగాణలో ఇదే మొదటిసారి..! సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం..

5 months ago 5
సైబర్ నేరస్థులపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్‌ కమిషనరేట్ పరిధిలో ఒక సైబర్ నేరస్థుడిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి.. అక్కడ వారితో బలవంతంగా సైబర్ మోసాలకు పాల్పడేలా చేస్తున్న నాగశివ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు. అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article