Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి మొదలుపెట్టి సెలెబ్రిటీల వరకు ఏ ఒక్కరినీ వదలకుండా సాంతం దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో బిష్ణు అధికారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్‌లో దింపి.. ఏకంగా.. 45 లక్షల రూపాయలు కాజేశారు. యూట్యూబ్‌లో టాస్కులు పూర్తి చేస్తే.. ఊహించనంత డబ్బు వస్తుందని నమ్మించటంతో ట్రాప్‌లో పడి అడిగినంత డబ్బు సమర్పించుకున్నాడు. అంతా పూర్తయ్యాక కానీ హీరోకు అసలు విషయం అర్థం కాలేదు.