తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ఓ గుంటనక్క అంటూ తీవ్ర పదజాలం వాడారు. పదేళ్లు అధికారంలో ఉండి మాాటలతో కాలం వెలిబుచ్చారని విమర్శించారు. అయితే, తెలంగాణ మాజీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు కారణం ఏంటి? అయనపై అంత కోపం ఎందుకు? అనే చర్చ జరుగుతోంది. కేవలం కేసీఆర్ అలా అన్నందుకే ఇంత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాల్సిన అవసరం లేదు.