సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునేందుకు తిరుమల లడ్డూలను ఉపయోగిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి.. సోషల్ మీడియాలో తన కంటెంట్ షేర్ చేసిన వారికి.. లడ్డూలను ఆఫర్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది. టీటీడీ విజిలెన్స్ విభాగం దీనిపై విచారణ జరుపుతోంది. దర్యాప్తు అనంతరం నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.