సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర సందర్భంగా జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మరణించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు.. బాధిత కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున సౌదీకి తీసుకెళ్లేందుకు మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని ప్రభుత్వం తీర్మానించింది.