Tragic Accident In Hyderabad: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో విషాదం చోటుచేసుకుంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కళ్లెదుటే కుమారుడు మృతి చెందాడు. బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న అభిమాన్షు రెడ్డి అనే బాలుడిని టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.