హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేవారికి అలర్ట్. ఆహార పదార్థాల తయారీ, శుభ్రత విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో వ్యాపారాలు చేసే వారందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఆయా వ్యాపారులను ఆహార భద్రతా ప్రమాణాల చట్టం పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.