ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ లీడర్ ఆనం వెంకటరమణారెడ్డి ఫైరయ్యారు. చంద్రశఖర్ రెడ్డి రాజీనామా చేస్తూ చాలా ఆరోపణలు చేశారని.. మంత్రి నారాయణ పేరును ప్రస్తావించారని అన్నారు. రాజీనామాకు నారాయణ బెదిరింపులే కారణమనే రీతిలో చంద్రశేఖర్ రెడ్డి కథలు అల్లారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. 2019 వరకూ చంద్రశోఖర్ రెడ్డి .. రెడ్ క్రాస్‌లో మెంబరే కాదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కనీసం ఒక్క చుక్క రక్తదానం చేశావా అని ప్రశ్నించారు. రెడ్ క్రాస్‍కు తానేదే సేవ చేసినట్లు ఇప్పుడు ఏవేవో మాటలు చెప్తున్నారని సెటైర్లు వేశారు. ఆయనేదో పెద్ద నాయకుడిలా ఫీలవుతున్నారని అన్నారు. నిన్ను బెదిరించాలనుకుంటే ఒక్క స్కూల్ కూడా నడపలేవంటూ హెచ్చరించారు. స్పాట్ పెట్టడానికి, స్కెచ్ వేయడానికి నువ్వేమీ పెద్ద పుడింగివి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.