వైఎస్ జగన్, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. వైఎస్ జగన్పై లోకేష్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు గతంలో తనపై, తన కుమార్తెపై పెట్టిన మరో పోస్ట్ పెట్టారన్నారు. ఆయన నోరు తెరిస్తే బూతులేనని.. అయినా ఆయనపై కేసులుండవా? అనిప్రశ్నించారు. వాటిపై ఫిర్యాదు చేసి, అవి పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. హోం మంత్రి అనిత బైబిల్ పట్టుకుని తిరుగుతానని ఆమె చెప్పుకున్నారని.. ఆమె ఎస్సీనో క్రిస్టియనో అని ప్రశ్నించినందుకు తమ పార్టీ వారిపై కేసు పెట్టారన్నారు. మైకు ముందు హోం మంత్రి అనిత అయితే వ్యవహారాలన్నీ చూసేది మాత్రం లోకేశ్.. ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నారని.. ఆమెపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నారు.