కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఏఐ ఫోటోను రీపోస్ట్ చేయడంతో పాటు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. దీనిపై సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేయగా, సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదని న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర వివరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.