వైఎస్ఆర్ జిల్లా పేరును ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. జిల్లా పేరు మార్పుపై సోమవారం జీవో విడుదల అయ్యింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనను బాధిస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే లాజిక్‌తో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల.