స్వేచ్ఛ నా భర్తను బ్లాక్‌మెయిల్ చేసేది.. పూర్ణచందర్ భార్య సంచలన వీడియో

1 year ago 25
స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపణలు వస్తున్న వేళ.. పూర్ణ చందర్ భార్య స్వప్న స్పందించారు. పూర్ణచందర్, స్వేచ్ఛ ఇద్దరూ స్నేహితులని మాత్రమే తనకు తెలుసని.. ఆయన ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని స్వప్న తెలిపారు. వాళ్ల రిలేషన్ గురించి స్వేచ్ఛ ద్వారానే తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత తాను భర్తను వదిలేశానని చెప్పారు. స్వేచ్ఛ కూతురు తన భర్తపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్వప్న తెలిపారు. తన పిల్లలతో సమానంగా స్వేచ్ఛ కూతురును కూడా పూర్ణ బాగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్‌మెయిల్ చేసేదని.. స్లీపింగ్ పిల్స్ మింగేదని స్వప్న తెలిపారు. తన భర్తపై తనకు నమ్మకం ఉందని.. ఆయన అంత చెడ్డ వ్యక్తి కాదని ఆమె తెలిపారు. తనకు కోర్టు మీద నమ్మకం ఉందని.. తన భర్త నిర్దోషి అని.. ఆయనను ఎలాగైనా తాను కాపాడుకుంటానని స్వప్న తెలిపారు.
Read Entire Article