హైదరాబాద్ మెట్రో రెండోదశలో ఎయిర్‌పోర్టులు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టు వద్ద 1.65 కి.మీ., శంషాబాద్ విమానాశ్రయం వద్ద 1.6 కి.మీ. భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. మొత్తం ఏడు కారిడార్లలో 122.9 కి.మీ. మేర 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.38,595 కోట్లు కాగా.. కేంద్రం, రాష్ట్ర నిధులతో పాటు రుణాల ద్వారా నిధులు సమీకరించనున్నారు. రైల్వే, జాతీయ రహదారులు, విమానాశ్రయ సంస్థల అనుమతులు కీలకంగా మారనున్నాయి.