మెట్‌పల్లిలో మహిళలతో వలవేసి ధనవంతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రౌడీ షీటర్ కోరుట్ల రాజు, బలుమూరి స్వప్నతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి.. అమాయక వ్యక్తులను గదికి రప్పించి నగ్న వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. తాజాగా ఓ వ్యాపారిని రూ. 10 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రాజు, స్వప్నతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు.