Anantapur Honey Trap Case Update: అనంతపురం జిల్లా హనీట్రాప్ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులతో లింక్, బాధితుల ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఓ సీఐ, ముగ్గురి కానిస్టేబుళ్లపై వేటు పడింది. మరో ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరో సీఐని డీఐజీకి అటాచ్ చేశారు. పోలీసులు ఈ హనీట్రాప్ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.. మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నారు.