హఫీజ్‌పేట్‌‌లో మహిళపై అమానుష దాడి.. హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి డిస్మిస్

1 hour ago 3
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై దాడి చేసిన ఘటనలో హోంగార్డుపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన దక్షిణ మధ్య రైల్వే.. దాడికి పాల్పడింది ఆర్పీఎఫ్ సిబ్బంది కాదని.. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు ఆనంద్ అని స్పష్టం చేసింది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
Read Entire Article