హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారిని 4 నుంచి 6 వరుసలకు విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విస్తరణతో ప్రయాణ సమయం 2 గంటలు తగ్గుతుందని.. ప్రమాదాలు నివారించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.