మాజీ మంత్రి హరీశ్ రావు పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే పోలీసు అధికారులను.. రిటైర్మెంట్ తర్వాత కూడా వదలిపెట్టబోమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిని ఎక్కడున్నా పట్టుకొచ్చి విచారిస్తామని చెప్పారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.