Gudivada Software Engineer Killed In Haryana: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హర్యానాలో దారుణ హత్యకు గురయ్యాడు. పంచకులలో తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన పది రోజులకే ఈ దారుణ ఘటన జరిగింది. గుడివాడ పోలీసులకు హర్యానా పోలీసులు సమాచారం ఇచ్చారు. యువకుడి ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.