AP Govt health Insurance to Welfare Hostel Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు 50 వేల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించనుంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలో అమలవుతున్న 'గోల్డెన్ అవర్ బీమా' పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం పొందే అవకాశం లభిస్తుంది.