హిందువుల జోలికొస్తే ఖబడ్దార్.. బంగ్లాదేశ్‌కు వార్నింగ్

1 month ago 4
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలంగాణలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో హిందూ ఐక్య వేదిక శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టింది. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అలాగే, కరీంనగర్‌లో కలెక్టరేట్ ఎదుట పలువురు పీఠాధిపతులు, హిందూ ఐక్య వేదిక నాయకులు నిరసన చేపట్టారు. హిందూ ఐక్య వేదిక సభ్యులు ముందుగా వికారాబాద్ న్యూ గంజ్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి.. అనంతరం హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వికారాబాద్ NTR చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు స్వామీజీలతో పాటు హిందూ సంఘాల నాయకులు పెద్దలు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు
Read Entire Article