తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలను అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు గ్రామసభలు నిర్వహిస్తూ.. లబ్దిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. ఈ క్రమంలో.. ఎన్నో ఏళ్ల తర్వాత సొంతింటి కల నేరవేరుతుందన్న ఆనందంతో భావోద్వేగానికి లోనైన క్షణాలు కనిపించాయి. ఇందులో భాగంగానే.. ఓ దివ్యాంగురాలికి ఇల్లు మంజూరైన సంతోషంలో భావోద్వేగంతో ఆనందభాష్పాలు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.