High Court on KA Paul Petition: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలంటూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు (అక్టోబర్ 04న) విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ క్రమంలో.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. కూల్చివేతలను ఇప్పటికిప్పడు ఆపేయటం సాధ్యం కాదని చెప్తూనే.. హైడ్రాకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.