GHMC Christmas Gift Celebrations: క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. నగరంలోని 198 చర్చిల్లో కేక్ కటింగ్, భోజనాలతో వేడుకలు నిర్వహించనుంది. అంతేకాకుండా, 1750 చర్చిలకు పెయింటింగ్, డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేయనుంది. ఈ వేడుకల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనుంది. చర్చిల పాస్టర్లు, స్థానికులు డిసెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిధులు కావాలనుకునే వారు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.