ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టికెట్లేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ తెరలను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం మేరకు హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది బస్సుల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్‌స్టాప్‌ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. ప్రయాణికుల స్పందన, ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన అనంతరం నగరంలోని ఇతర డిపోల బస్సులకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది.