హైదరాబాద్: ఇంట్లో సిలిండర్‌ పేలి.. వీధిలో వెళ్తున్న వ్యక్తి మృతి

7 months ago 13
హైదరాబాద్‌లో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో గ్యాస్ పేలడంతో.. వీధిలో వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. మేడ్చల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. సిలిండర్ పేలి, రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగింది.. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article