ఇండిగో విమానాల సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా వందకు పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం మూడు విమానాల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చాయి. తాజాగా అమెరికా నుంచి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బాంబు పేల్చకుండా ఉండాలంటే రూ.9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు దుండగుడు. దీంతో విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి.