హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డేటా సెంటర్ల సంస్థ CtrlS డేటా సెంటర్స్‌లో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు రూ.7 వేల కోట్ల మేర భారీ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.4 వేల కోట్లతో 8.2 శాతం వాటాను సీపీపీ కొనుగోలు చేసింది. మిగిలిన రూ.3,000 కోట్లతో దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు జాయింట్ వెంచర్ ప్రారంభించనున్నారు. ఈ భాగస్వామ్యం భారతదేశంలో పెరుగుతున్న క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల డిమాండ్‌ను తీర్చనుంది.