హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వైమానిక రంగానికి చెందిన ఈ ఫార్చ్యూన్ 500 సంస్థ.. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాథమికంగా 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇది జీసీసీ బోయింగ్ లేదా ఎమిరేట్స్ గ్రూప్‌కు చెందినదై ఉండవచ్చని ఐటీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరమే 31 ఫార్చ్యూన్ 500 సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ప్రారంభించగా.. ఈ కొత్త సంస్థ రాక నగర వృద్ధిని మరింత పెంచనుంది.