హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ చరిత్రలో తొలిసారి 2025 డిసెంబర్లో రూ. 5 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లో దాదాపు రూ.750 లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్‌లో నమోదైన రూ. 4,300 కోట్ల రికార్డును.. ఈ డిసెంబర్ బ్రేక్ చేసింది. కాగా, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు, మద్యం దుకాణాల సమయం పొడిగింపు వంటి కారణాలతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.