హైదరాబాద్ చుట్టూ 4 మెగా రైల్వే టెర్మినళ్లు.. 1,125 ఎకరాల్లో, ఈ ప్రాంతాల్లో కొత్త స్టేషన్లు

2 hours ago 1
హైదరాబాద్ రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే నలుదిక్కులా నాలుగు మెగా టెర్మినళ్లను ప్రతిపాదించింది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి, డబిల్‌పూర్, నాగులపల్లి, జుక్కల్ వద్ద ఈ హబ్‌లను నిర్మించనున్నారు. ఇందుకోసం 1,125 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే కోరింది. రూ. 13.96 కోట్లతో నిర్వహించిన సర్వే పూర్తయి రైల్వే బోర్డు ఆమోదానికి చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు నగర రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.
Read Entire Article