హైదరాబాద్ పరధిలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువుకు సంబంధించిన బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా.. దానిపై స్పందించిన హైకోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. గతంలో ప్రభుత్వం చెప్పిన 3532 చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.