గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించి శివారు పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విలీన ప్రక్రియ పూర్తయితే డివిజన్ల సంఖ్య సుమారు 300కి పెరిగే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్ల హద్దులను ఒకే అసెంబ్లీ స్థానం పరిధిలో ఉండేలా పునర్విభజన చేయాలని అధికారులు నిర్ణయించారు.