హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు మెుదలుపెట్టింది. అఫ్జల్‌గంజ్, మదీన, బీహెచ్‌ఈఎల్ సహా ఆరు చోట్ల స్కైవాక్స్ రానున్నాయి. జేఎన్‌టీయూ వద్ద లూలూ మాల్, మెట్రో స్టేషన్లను కలిపేలా భారీ స్కైవాక్ కట్టనున్నారు. ఉప్పల్ తరహాలో ఈ స్కైవాక్స్ పాదచారులకు సౌకర్యంగా ఉంటాయన్నారు.