హైదరాబాద్ క్యూర్-2026 బిల్లుతో ఓఆర్‌ఆర్ పరిధిలోని మహానగర ప్రాంతాలకు సమగ్ర పరిపాలన అందించేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను ప్రతిపాదించింది. జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో వచ్చే ఈ బిల్లులో హైడ్రా, జలమండలి, పోలీసు తదితర వ్యవస్థలను సమన్వయం చేయనున్నారు. అక్రమ నిర్మాణాలపై భారీ జరిమానాలు, కూల్చివేత, సీజ్, కనెక్షన్ల నిలిపివేత వంటి చర్యలకు అవకాశం ఉంటుంది. ఆస్తిపన్నును భూ విలువ ఆధారంగా మార్చడంతోపాటు డిజిటల్ సేవలు, భవనాలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు, పర్యావరణ పరిరక్షణ, అప్పీల్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు.