హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు హైడ్రా అధికారులుగా చెప్పుకుంటూ ఓ ఇంటి యజమానిని బెదిరించారు. ఇంటిని కూల్చివేస్తామని బెదిరించడంతో వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఆ వివరాలు.